శేరిలింగంపల్లి, నవంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): వృత్తి ధర్మమే సమాజంలో గుర్తింపునిస్తుందని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ కొండాపూర్ ఎంపీపీఎస్ పాఠశాలలో హెచ్ఎం శేగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉద్యోగ విరమణ అభినందన సభలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డిని ఉపాధ్యాయులతో కలిసి శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయుడు శేగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయంగా గుర్తుండి పోతాయన్నారు. 35 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో వెలకట్టలేని సేవలందించి ఎలాంటి మచ్చ లేకుండా క్రమశిక్షణతో ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థాయికి ఎదిగేలా విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత దక్కించుకుని ఎలాంటి చెడ్డపేరు లేకుండా కృషి చేసిన ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. వృత్తి ధర్మమే సమాజంలో గుర్తింపునిస్తుందని, ఆయన శేష జీవితం మంచి ఆరోగ్యంతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఆటపాటలతో అందరినీ అలరించారు.

ఈ కార్యక్రమంలో PRTU టీఎస్ రంగారెడ్డి అధ్యక్షుడు శ్యామల మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణా రెడ్డి, మండల PRTU అధ్యక్షుడు హనుమంతు, గౌరవ అధ్యక్షుడు రాఘవేందర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు సుభాష్ చంద్రా రెడ్డి, కొండాపూర్ ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామచంద్రయ్య, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, PRTU నాయకులు శివరాజ్, అనంత్ రెడ్డి, నాగయ్య, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.





