శేరిలింగంపల్లిని అగ్రగామిగా తీర్చిదిద్దుతాం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ఫిబ్ర‌వ‌రి 1 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని HMT స్వర్ణపూరి ప్రధాన రహదారి కమాన్ నుండి అబ్దుల్ కలాం విగ్రహం వరకు రూ.75.00 లక్షల అంచనా వ్యయంతో చెపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణం పనులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని తెలియచేశారు. మియాపూర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ HMT స్వర్ణపురి కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించుకోవడం చాలా సంతోషకర విషయం అని అన్నారు. HMT స్వర్ణపురి కాలనీ దశ దిశ ను మార్చామని, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తి చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు ఏఈ సంతోష్, వర్క్ ఇన్స్పెక్టర్ నవీన్, మాదాపూర్ డివిజన్ సీనియర్ నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హెచ్ఎంటి కాలనీ అధ్యక్షులు దేవేందర్ రావు, అసోషియేషన్ సభ్యులు దశరథ్ రావు, శివరామ రాజు, విరూపాక్షయ్య, రాఘవ రావు, రమేష్ చంద్ర, శ్రీపతి శర్మ, నరేందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, బాలయ్య, విద్యాసాగర్, మూర్తి, సురేష్, విధ్యానంద చారి, నర్సింగ్ రావు, నాగభూషణం, సత్యం, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here