నూతన సంవత్సరంలో నూతన కానుక

  • కొత్తగూడ – గచ్చిబౌలి ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
  • రూ. 263 కోట్ల వ్యయంతో నిర్మాణం
  • 3 KM మేర పొడవు, 470 మీటర్ల అండర్ పాస్ ,11 మీటర్ల వెడల్పు కలిగిన ఫ్లైఓవర్
నూతన సంవత్సర తొలి కానుక కొత్తగూడ – గచ్చిబౌలి ఫ్లైఓవర్

నమస్తే శేరిలింగంపల్లి : వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (SRDP)లో భాగంగా రూ. 263 కోట్ల వ్యయంతో చేపట్టిన కొత్తగూడ – గచ్చిబౌలి ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించి ప్రజలకు నూతన సంవత్సర కానుకను అందిచారు. ఈ కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, బీఆర్ ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్, కార్పొరేటర్లు హమీద్ పటేల్, జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పోరేటర్ సాయి బాబా, GHMC కమిషనర్ లోకేష్ కుమార్, జోనల్ కమిషనర్ శంకరయ్య, డీసీలు వెంకన్న, సుధాంష్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు.

కానుక కొత్తగూడ – గచ్చిబౌలి ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ రూ. 263 కోట్ల వ్యయంతో కొత్తగూడ – గచ్చిబౌలి ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించి నూతన సంవత్సరంలో నూతన కానుక అందించారని తెలిపారు. ఇది చాలా సంతోషకరమైన విషయమన్నారు. ట్రాఫిక్ రహిత, ఫ్రీ సిగ్నల్ కోసం రూ. 263.09 కోట్ల అంచనావ్యయం తో 3 KM మేర పొడవుతో 2,3,4,5 లైన్స్ తో, 470 మీటర్ల అండర్ పాస్ ,11 మీటర్ల వెడల్పు తో ఈ ఫ్లై ఓవర్ ను నిర్మించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారులు సీఈ శ్రీధర్‌, సీఈ ప్రాజెక్ట్స్‌ దేవానంద్‌, ఈఈ వెంకటరమణ, డీఈ భరద్వాజ్‌, ఏఈ శివకృష్ణ, ఏసీపీ మెహ్రా, ఏసీపీ సంపత్‌, శేరిలింగంపల్లి సిటీ ప్లానర్‌ మలికార్జున, డిప్యూటీ సిటీ ప్లానర్‌ గణపతి, టీపీఎస్‌ రవీందర్‌, ఏఎంఓహెచ్‌ నాగేశ్‌నాయక్‌, మాజీ కార్పొరేటర్లు, డివిజన్‌ అధ్యక్షులు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులు, బీఆర్‌ఎస్‌ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, జర్నలిస్టు మిత్రులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

కొత్తగూడ – గచ్చిబౌలి ఫ్లైఓవర్ ను ప్రారంభించేందుకు మంత్రులతో కలిసి వస్తున్న కేటీఆర్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here