- జాతీయ జెండా ఎగురవేసి వందనం చేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 75వ భారత గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి , నార్నె శ్రీనివాసరావు, మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జెండావందనం సమర్పించారు.
శేరిలింగంపల్లి నియోజక వర్గ ప్రజలకు 75 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే అది రాజ్యాంగం మనకు కలిపించిన హక్కు అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ ప్రతినిధులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.