కొండాపూర్ జిల్లా ఆసుప‌త్రిని స‌క‌ల హంగుల‌తో అభివృద్ది ప‌రిచేందుకు కృషి: ప్ర‌భుత్వ విప్ గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: కొండాపూర్ ప్ర‌భుత్వ జిల్లా ఆసుప‌త్రికి లిఫ్ట్ మంజూరు చేయ‌డం సంతోష‌క‌ర‌మ‌ని, ఆసుప‌త్రిలో మ‌రిన్ని సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామ‌ని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. ఆసుప‌త్రికి వ‌చ్చే రోగుల సౌక‌ర్యార్ధం లిఫ్ట్ ఏర్పాటు చేయాల‌ని గాంధీ జిల్లా క‌లెక్ట‌ర్‌ను కోర‌డంతో స్పందించిన క‌లెక్ట‌ర్ అమోయ్ కుమార్ రూ.23 లక్ష‌లు మంజూరుచేసి ప‌నులు ప్రారంభించాల‌ని టిఎస్ఎమ్ఎస్ఐడిసి అధ‌కారుల‌ను ఆదేశించారు. ఈ నేప‌థ్యంలో లిఫ్ట్ మంజూరుపై గాంధీ క‌లెక్ట‌ర్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఆసుప‌త్రిని అన్ని రకాల హంగులతో , సకల సౌకర్యాలతో కార్పొరేట్ ఆసుప‌త్రుల‌కు ధీటుగా అభివృద్ది చేస్తామ‌ని, వైద్యం కోసం వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటుకు కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారోగ్యం గూర్చి ఎంతగానో కృషి చేస్తున్నారని, ప్ర‌జారోగ్యం విష‌యంలో ప్ర‌త్యేక శ్రద్ధ క‌న‌బ‌ర్చుతూ మెరుగైన వైద్యసేవ‌లు అందించేందుకు చిత్తశుద్దితో ప‌నిచేస్తున్నార‌ని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here