బిజెపి నిర‌స‌న స‌భ‌కు త‌ర‌లిన శేరిలింగంప‌ల్లి నాయ‌కులు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: భార‌త ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎమ‌ర్జెన్సీ విధించిన నాటి ఘ‌ట‌న‌ల‌ను నిర‌సిస్తూ బిజెపి రాష్ట్ర క‌మిటీ ఆధ్వ‌ర్యంలో రాజేంద్ర‌న‌గ‌ర్‌లో నిర్వ‌హించిన స‌భ‌కు శేరిలింగంప‌ల్లి నియోజ‌వ‌ర్గ నాయ‌కులు త‌ర‌లివెళ్లారు. రంగారెడ్డి అర్బ‌న్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్థన్ గౌడ్, శేరిలింగంల్లి డివిజన్ ప్రధాన కార్యదర్శులు చిట్టారెడ్డి ప్రసాద్, ప్రశాంత్ చారి ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న స‌భ‌కు త‌ర‌లిళ్లిన నాయ‌కులు ఎమ‌ర్జెన్సీ స‌మ‌య‌పు ప‌రిస్థితుల‌ను గుర్తు చేశారు. ఈ సంద‌ర్భంగా నాయ‌కులు మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్య చరిత్రలో జూన్ 25 చీకటి దినమ‌ని, మానవ హక్కులు మంట కలిపిన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని బిజెపి మొదటి నుండి వ్యతిరేకిస్తూ వస్తుంద‌ని తెలిపారు. స‌భ‌కు త‌ర‌లివెళ్లిన వారిలో మారం వెంకట్, తోపుగొండ మైపాల్ రెడ్డి, రాజు శెట్టి, భరత్ రాజ్, రాఘవేంద్ర రావు, శాంతి భూషణ్ రెడ్డి, కుమార్ యాదవ్, విజయలక్ష్మి, సత్యనారాయణ, సత్య కురుమ, బాలరాజు, రజిని , అరుణ కుమారి,అశోక్ నాయక్, విట్టల్ రాథోడ్, ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు.

రాజేంద్ర‌న‌గ‌ర్ నిర‌స‌న‌స‌భ‌కు త‌ర‌లివెళ్తున్న శేరిలింగంప‌ల్లి బిజెపి నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here