
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలకు చేరుకున్న కొండా శనివారం తెల్లవారుజామున వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. హోప్ ఫౌండేషన్ సేవలను మరింత విస్తృత పరిచేందుకు శక్తీ సామర్ధ్యాలను ప్రసాదించాలని శ్రీనివాసుడిని వేడుకున్నట్టు తెలిపారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో హోప్ ఫౌండేషన్ ప్రతినిధులు పుట్ట వినయకుమార్ గౌడ్, మారం వెంకట్, రెడ్డి ప్రవీణ్ రెడ్డి, సంతోష్ కుమార్, మల్లికార్జున్, రమేష్ గౌడ్, శ్రీనివాస్, విజయకుమార్ లు పాల్గొన్నారు.