చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ లోని శాంతినగర్ కాలనీలో కేసీఆర్ చిత్రపటానికి స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి మంగళవారం పాలాభిషేకం చేశారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించినందుకు కేసీఆర్‌కు మహిళలంతా రుణపడి ఉంటామని అన్నారు. మహిళలకు 50% రిజర్వేషన్ ను కల్పించడం దేశంలోనే మొదటి రాష్ట్రం తెలంగాణ అని, 50% మహిళలకు రిజర్వేషన్ ను అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన మొట్టమొదటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు అన్నారు. అదేవిధంగా రిజర్వేషన్లను, డివిజన్లను యధావిధిగా కొనసాగించడం వలన డివిజన్ లో అభివృద్ధికి బాటలు వేయటానికి అవకాశం ఉంటుందని, డివిజన్ లో వార్డ్ సభ్యులు సంఖ్య పెంచడం, డివిజన్ అభివృద్ధికి ఎంతో తొడుపడుతుందని అన్నారు.