శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): నిజామాబాద్ స్థానిక సంస్ధల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో భారీ మెజారిటీ తో విజయం సాధించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. తోటి ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, సండ్ర వెంకట వీరయ్యలతో కలసి మంగళవారం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కవితను కొనియాడారు.