నిరుపేద మ‌హిళ‌కు హోప్ ఫౌండేష‌న్ కుట్టు మిష‌న్ పంపిణి

మంజుల‌కు కుట్టు మిష‌న్ ను అంద‌జేస్తున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, హోప్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ కొండా విజ‌య్‌కుమార్‌

చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్ ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్‌కి చెందిన మంజుల అనే మహిళకు ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ మంగ‌ళ‌వారం కుట్టు మిషన్ ను అందచేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ నిరుపేద మ‌హిళ‌ల కోసం హోప్ ఫౌండేష‌న్ అందిస్తున్న చేయుత అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. స‌మాజ హిత కార్య‌క్రమాల‌లో ముందువ‌రుస‌లో ఉంటున్నభహోప్ ఫౌండేష‌న్ చైర్మ‌న్‌ కొండా విజ‌య్‌కుమార్‌ను వారు ప్ర‌త్యేకంగా అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు రంగ‌రాయ ప్ర‌సాద్‌, బ్రిక్ శీను, ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు రెడ్డి ప్ర‌వీణ్‌రెడ్డి, ‌శీను ముదిరాజ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here