- కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీష్ అన్నను గెలిపించుకుందామని పిలుపు
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ ని గెలిపించేందుకు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. తనకే ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామంటూ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగానే పి.ఏ. నగర్ స్ధానికులు నర్సింహ, చందానగర్ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు దొంతి కార్తీక్ గౌడ్ బృందం ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పి.ఏ. నగర్ లోని ప్రతీ కుటుంబానికి 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకే ఓటేద్దామని పిలుపునిచ్చారు. జగదీష్ అన్నను గెలిపించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలీ, హారి కిషన్, శ్రీనివాస్ చారి, నరదర్, శఫీ, వెంకటేష్, సునిల్, ఫయాజ్, దినేష్ గౌడ్, మెరాజ్, గౌస్, అయాజ్, అజీం, మహిలా నాయకులు మంగ, శాంత, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.