హఫీజ్ పెట్ (నమస్తే శేరిలింగంపల్లి) డివిజన్ పరిధిలోని హఫీజ్ పేట్ కాయిదమ్మ కుంట చెరువు వద్ద చెత్త పేరుకుపోయి తూములోనుండి వెళ్ళవలసిన వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. విషయం తెలుసుకున్న హఫీజ్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ జిహెచ్ఎంసి సిబ్బంది సహకారంతో పైప్ లలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా బాలింగ్ గౌతమ్ గౌడ్ మాట్లాడుతూ రోడ్లపై వెళ్తున్న ద్విచక్ర వాహన దారులు నెమ్మదిగా వెళ్ళాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిన్నపిల్లలను బయటికి వెళ్లకుండా తల్లిదండ్రులు చూసుకోవాలన్నారు. ఇంకా రెండు మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలియజేసిన నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలకు ఆయన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి సిబ్బంది, తెరాస నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.