హఫీజ్‌పేట్ (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్‌లోని బిజెపి నాయకులను మియాపూర్ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ ప్రక్రియను ఖండిస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అసెంబ్లి ముట్టడి పిలుపునిచ్చిన నేపథ్యంలో హఫీజ్‌పేట్ డివిజన్‌లోని బిజెపి నాయకులు బోయిని మహేష్ యాదవ్, శ్యామ్, ఆంజనేయులు, ప్రసాద్, చందు, రాజ్ జైశ్వాల్‌లతో పాటు మొత్తం 8 మందిని మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం వ్యక్తిగత పూచీకత్తపైన వదిలేశారు. కాగా ప్రభుత్వ చర్యను మహేష్ యాదవ్ ఖండించారు. ప్రభుత్వం వెంటనే ఎల్ఆర్ఎస్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.