– అత్యవసర పరిస్థితుల్లో శేరిలింగంపల్లి కంట్రోల్ రూం నెం.91548 32003 / డీఆర్ఎఫ్ కంట్రోల్ రూం నెం.040-29555500 లలో సంప్రదించండి
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): భారీ వర్షాల నేపథ్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలందరూ అప్రమత్రంగా ఉండాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తుతుందని, మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగనున్న తరుణంలో ప్రజలంతా తమ ఇండ్ల నుంచి బయటకి రావొద్దని సూచించారు. అత్యవసరం ఐతే తప్పితే ఎవరు బయటకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి ఇబ్బందులు కలిగిన(ఎలక్ట్రికల్, రోడ్డు, డ్రైనేజీ) వెంటనే సంబంధిత అధికారులకు లేదా తమ కార్యాలయానికి సమాచారం అందివ్వాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే శేరిలింగంపల్లి ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ నెంబర్ 91548 32003 లేదా జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) కంట్రోల్ రూం నెంబర్ 040-29555500లో సంప్రదించాలని సూచించారు.