శేరిలింగంపల్లి: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా హాఫిజ్ పేట్ డివిజన్ హుడా కాలనీ జయశంకర్ పార్కులో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ తెలంగాణ మట్టికి పోరు పాఠం నేర్పిన వ్యక్తి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాలకు ప్రత్యక్ష సాక్షి జయశంకర్ సార్ అని అన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన వ్యక్తి జయశంకర్ సార్ అని అన్నారు. యావత్ జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ గా, యూనివర్సిటీ రిజిస్టర్ గా, వైస్ ఛాన్స్లర్గా పలు బోర్డులలో సభ్యునిగా అత్యున్నత పదవులను అధిరోహించిన వ్యక్తి జయశంకర్ సార్, ఆత్మగౌరవం కోసం అవిశ్రాంతంగా పోరాడిన మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్ అని పేర్కొన్నారు.
విగ్రహాన్ని స్థాపించిన కమిటీ సభ్యులు రాజేశ్వర్ గౌడ్, సురేష్, ఇతరులను ఈ సందర్బంగా సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కోమండ్ల శ్రీనివాస్ రెడ్డి, మల్లికార్జున శర్మ, గంగారపు సంగారెడ్డి, తెప్ప బాలరాజ్ ముదిరాజ్, అంజద్ అమ్ము, నర్సింగ్ రావు, కాకర్ల అరుణ, రమణ, సత్తిరెడ్డి, సలీం బాయ్, మున్ ఆఫ్ ఖాన్, దేవేందర్రావు, వెంకటరమణ, పార్క్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.