నమస్తే శేరిలింగంపల్లి : జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత వైద్యం శిబిరం కొనసాగుతున్నది. 110 చందానగర్ డివిజన్ అద్యక్షుడు అరుణ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండలు నాయకత్వంలో స్థానిక జనసేన పార్టీ ఆఫీసు సమీపంలో పీజేఆర్ స్టేడియం వద్ద ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక కాలనీవాసులు, పేద బడుగు బలహీనర్గాల ప్రజలు విశేషంగా పాల్గొని వైద్య సేవలు వినియోగించుకున్నారు.
డాక్టర్ మాధవ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కంటి వైద్య పరీక్షల అనంతరం కళ్లజోళ్లు పంపిణీ చేశారు. కంటి చూపు సమస్యలతో బాధపడే వారికి మెరుగైన సేవలందించేందుకు రానున్న కాలంలో మరిన్నీ ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.