కాలనీల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తా

  • ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ సభ్యులు, అభిమానులు ఎమ్మెల్యే గాంధీకి అభినందనలు తెలిపి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఆత్మీయ అభినందన సభలో ఎమ్మెల్యే గాంధీని సన్మానిస్టున్న దృశ్యం

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ సభ్యులకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని, తనపై చూపిన ఆధారభిమానాలకు ధన్యుడినని, అన్ని కాలనీల సమగ్ర అభివృద్ధి కి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ సభ్యులు

ఈ కార్యక్రమంలో ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ అధ్యక్షులు అమర్నాథ రెడ్డి, తాత కర్ణాకర్ జనరల్ సెక్రటరీ, మహేందర్ ట్రెజరర్, సభ్యులు నాగిరెడ్డి, సంజయ్, వేణు, మధు, చంద్రశేఖర్, రఘు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here