- శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రతి బస్తి, కాలనీలలో నెలకొన్న ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎం.ఏ నగర్ బస్తీలో దీర్ఘకాలికంగా ఉన్న అభివృద్ధి పనులు, బస్తీలో నెలకొన్న ఇల్లు, రోడ్ల సమస్యలను డివిజన్ నాయకులు, కాలనీ సభ్యులతో కలిసి పరిశీలించారు.
నియోజకవర్గంలోని ప్రతి డివిజన్, కాలనీ, బస్తీలను ఆదర్శవంతమైన సుందరంగా తీర్చిదిదేలా, అందరి సమిష్టి కృషితో అభివృద్ధి పనులను చేపడతామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇలియస్ షరీఫ్, వీరేందర్ గౌడ్, సాంబశివరావు, తిరుపతి, రామచందర్, రవి, రాంబాబు పాల్గొన్నారు.