స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అంబిర్ చెరువు వద్ద నిర్వహించిన స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమంలో డీసీ కృష్ణయ్య, డీసీ మోహన్ రెడ్డి, కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, ఏఎంహెచ్ఓ మమతతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటాకె, చెరువులో దోమల లార్వా నిర్ములనకోసం ఎంఎల్వో ఆయిల్ బాల్స్ ను వేసి, దోమల నివారణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తున్నదని అన్నారు. కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, సామాజిక వేత్తలు అందరి సమిష్టి కృషితో బస్తీలు, కాలనీలు ఆదర్శవంతమైన, సుందరవనంగా తీర్చిదిద్దడానికి ఎంతో ఉపయోగపడుతుందని, అందరి సమిష్టి కృషితో, అందరి భాగస్వామ్యంతో మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జానకి రామరాజు, యూఎస్డీ డైరెక్టర్ శ్రీనివాసరావు, మేనేజర్ రఘువీర్ రెడ్డి, ఎస్ఆర్పీ సత్యనారాయణ, ఎంటమాలజీ సూపర్ వైజర్ నర్సింహ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.