నమస్తే శేరిలింగంపల్లి : కాలనీలలో నెలకొన్న సమస్యలను త్వరితగతిని పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలంటూ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కోరారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై హెచ్ఎండబ్ల్యూఎస్, ఎస్బీ డీజీఎం నాగ ప్రియని మర్యాద పూర్వకంగా కలసి చర్చించారు.

కాలనీలలో మంచినీటి, డ్రైనేజీ సమస్యలు, మంచినీటి లైన్ల ఏర్పాటు, దశాబ్ద కాలం నాటి (హెచ్ డి పి)పైపు లైన్లను వెంటనే మార్చి కొత్తగా (డి ఐ) పైపు లైన్లను ఏర్పాటు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యూఎస్, ఎస్బీ ఏరియా మేనేజర్ సునీత, వర్క్ఇన్స్పెక్టర్ రమేష్, కురువ కిరణ్, నర్సింహ పాల్గొన్నారు.