- తహసిల్దార్ కార్యాలయంలో మహిళా మోర్చా తరఫున వినతి పత్రం అందించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి కుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అములు చేసేలా చూడాలని కోరుతూ… మహిళా మోర్చా నాయకురాలు వరలక్ష్మి, మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి, స్రవంతి, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి ఎమ్మార్వో వెంకటారెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ప్రకటించిన హామీలు (మహాలక్ష్మి పథకం కింద నెలకు 2500 రూపాయలు, నవవధువుకు తులం బంగారం, 18 సంవత్సరాలు నిండి కాలేజీకి వెళ్ళే ప్రతి ఆడపిల్లకు స్కూటీలు, ఐదు లక్షల విద్యార్థి హామి కార్డులు, మహిళలకు 4000 వేల పెన్షన్ బకాయిలతో సహా చెల్లింపు) వెంటనే నెరవేర్చాలని చేయాలని ఎమ్మార్వోకు విన్నవించామని, కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే విధంగా తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ యాదవ్, హనుమంతు నాయక్ ,రాజు శెట్టి, ఆంజనేయులు సాగర్, తిరుపతి, రమేష్, కవితా బాయ్, మౌనిక, హేమ, రాణి, సీమ పాల్గొన్నారు.