నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ లోని పలు వినాయక మండపాలను కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ సందర్శించారు. అనంతరం వినాయకులను ప్రత్యేక పూజలు చేశారు.
కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజా రాజేశ్వరి కాలనీ, వీకర్ సెక్షన్ కాలనీ, మార్తాండ్ నగర్, ఆనంద్ నగర్ కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలలో పూజలు చేసి, అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని భక్తులకు భోజనం వడ్డించారు.