ఆర్టీసీ కాలనీని మరింత‌ అభివృద్ధి చేస్తాం: హఫీజ్ పేట్ కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి :హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో ఆరో రోజు నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో స్థానిక‌ కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ ‌గౌడ్ పాల్గొన్నారు. కాలనీలో పర్యటించి నూతనంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై స్థానికులతో చర్చించారు. కాలనీలో ఉన్న మట్టి కుప్పలను తొలగించి, డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని, నూతన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, డీఈ శ్రీ.సురేష్, వాటర్ వర్క్స్ అధికారులు, ట్రాన్స్ కో ఏఈ ఖాద్రీ, శానిటేషన్ ఎస్ఆర్ పీ గంగారెడ్డి తో పాటు హఫీజ్ పేట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బల్లింగ్ గౌతమ్ గౌడ్, వార్డ్ సభ్యులు కనక మామిడి వెంకటేష్ గౌడ్, కాలనీ వాసులు, స్థానిక నాయకులు పద్మ రావు, వెంకట్ రెడ్డి, సత్యనారాయణ, సిద్దేశ్వర్ రెడ్డి, జీ.వి.శ్రీనివాస్, రమేష్, గోపాల్ రెడ్డి, దేవేందర్ రావు, వి.శ్రీనివాస్ చారి, కొండల్ రావు, శంకర్, యుగేందర్ రెడ్డి, కోటేశ్వర రావు, మహిళలు శ్రీదేవి, పద్మ, శిరీష తదితరులు పాల్గొన్నారు.

హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఆర్టీసీ‌ కాలనీలో‌ చెత్తాచెదారం తొలగింపజేస్తున్న కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here