నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని ఫ్రేండ్స్ కాలనీ, శిల్పా ఎన్ క్లేవ్, గౌతమీ నగర్ కాలనీలలో స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్య్లుఎస్, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,ప్రజలకు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమం దోహదపడుతుందన్నారు. కాలనీ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కార్పొరేటర్ మంజుల రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి ,అధికారులు సునిత, జగదీష్, బాలాజీ, శివ, టిఆర్ఎస్ నాయకులు లక్ష్మినారాయణ గౌడ్, జనార్ధన్ రెడ్డి, ధనలక్ష్మి ,మల్లేష్ గుప్త ,అక్బర్ ఖాన్, దాసు, ధనలక్ష్మి, కొండల్ రెడ్డి, యుసుప్, అంజద్ పాషా,మెహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.