మ‌నువ‌డిని తీసుకెళ్ల‌డానికి వ‌చ్చిన మామ‌ను క‌త్తితో పొడిచి చంపిన‌ అల్లుడు…హ‌ఫీజ్‌పేట‌లో దారుణ హ‌త్య‌.

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: కూతురి కుమారుడిని వియ్యంకుడి ఇంటి నుండి తీసుకువెళ్ల‌డానికి వ‌చ్చిన మామ‌ను అత‌ని అల్లుడు కిరాత‌కంగా క‌త్తితో పొడిచి చంపాడు. మియాపూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి… న్యూహ‌ఫీజ్‌పేట సుభాష్‌చంద్ర‌బోస్ న‌గ‌ర్‌లో నివాస‌ముండే షేక్ హ‌ఫీజ్(45) త‌న కుమార్తె రేష్మ‌బేగం ను ఆదిత్య‌న‌గ‌ర్‌లో నివాస‌ముండే ఒమ‌ర్‌తో కొన్ని సంవ‌త్స‌రాల క్రితం వివాహం జ‌రిపించాడు. రేష్మ‌, ఒమ‌ర్‌ల దాంప‌త్య జీవితంలో త‌ర‌చూ గొడ‌వ‌లు రావ‌డంతో కొద్దికాలంగా రేష్మ త‌ల్లిదండ్రుల వ‌ద్ద‌నే ఉంటోంది.

మృతుడు షేక్ హ‌ఫీజ్‌

కాగా రేష్మ కుమారుడు ఒమ‌ర్ వ‌ద్ద ఉండ‌టంతో త‌మ వ‌ద్ద‌కు పంపాల‌ని హ‌ఫీజ్ ఒమ‌ర్ త‌ల్లిదండ్రుల‌ను అడిగేందుకు సుభాష్‌చంద్ర‌బోస్ న‌గ‌ర్‌లోని వారి నివాసానికి వెళ్లాడు. కూతురి జీవితం గురించి ఒమ‌ర్ త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడే స‌మ‌యంలో మామ‌పై కోపంతో ఉన్న ఒమ‌ర్ క‌త్తితో హ‌ఫీజ్‌ త‌ల వెన‌క‌భాగంలో దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న‌లో తీవ్ర ర‌క్త‌స్త్రావం కార‌ణంగా హ‌ఫీజ్ అక్క‌డికక్కడే మృతి చెందాడు. విష‌యం తెలుసుకున్న పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుప్ర‌తికి త‌ర‌లించారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

సంఘ‌ట‌న స్థ‌లంలో షేక్ హ‌ఫీజ్ మృత‌దేహం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here