హఫీజ్‌ఫేట్ (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ గ్రామంలోని శ్రీ కనకదుర్గా దేవి, రేణుకా ఎల్లమ్మ, పొచమ్మ దేవాలయం దసరా ఉత్సవాలకు సిద్దమైంది. శనివారం నుంచి ఈ నెల 25 వరకు శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ ధర్మకర్తలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హఫీజ్‌పేట్ గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు.