ఉత్సాహంగా ఎంగిలి పూల బ‌తుక‌మ్మ

జ‌వ‌హార్ కాల‌నీలో బ‌తుక‌మ్మ ఆడుతున్న చందాన‌గ‌ర్ కార్పొరేట‌ర్ బొబ్బ న‌వ‌తారెడ్డి

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఎంగిలి పూల బ‌తుక‌మ్మతో శేరిలింగంప‌ల్లిలో బ‌తుక‌మ్మ వేడుక‌లు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఒక‌వైపు క‌రోనా, మ‌రోవైపు వ‌ర్షాల ప్ర‌భావం ఉన్న‌ప్ప‌టికి మ‌హిళ‌లు ఉత్సాహంగా బ‌తుక‌మ్మ‌లు ఆడుతూ సంద‌డి చేశారు. చందాన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని జ‌వ‌హార్ కాల‌నీలో స్థానిక కార్పొరేట‌ర్ న‌వ‌తారెడ్డి బ‌తుక‌మ్మ‌ను పేర్చి కాల‌నీ మ‌హిళ‌ల‌తో క‌లిసి బ‌తుక‌మ్మ ఆడారు. న‌ల్ల‌గండ్ల హుడా, గోపిన‌గ‌ర్‌ల‌లోను మ‌హిళ‌లు ఉత్సాహంగా బ‌తుక‌మ్మ‌లు ఆడుతూ సంద‌డి చేశారు. పాపిరెడ్డి కాలనీ లో కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప గుడి ప్రాంగణంలో ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

న‌ల్ల‌గండ్ల హుడాలో తొలిరోజు ఉత్సాహంగా బ‌తుక‌మ్మ ఆడుతున్న మ‌హిళ‌లు
పాపిరెడ్డి కాలనీ లో కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప గుడి ప్రాంగణంలో ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు
గోపిన‌గ‌ర్‌లో ఓ ఇంటి ముందు చిన్నారుల బ‌తుక‌మ్మ ఆట‌
ఎంగిలిపూల బ‌తుక‌మ్మతో ఓ సోద‌రి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here