ప్రతి ఇంట్లో హోమం నిర్వహించాలి

నమస్తే శేరిలింగంపల్లి : హోమం తదితర పూజ కార్యక్రమాలతో గుల్మొహర్ పార్క్ కాలనీలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. నలుబై మంది అభ్యాసకులు హాజరై హోమం, తదితర పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

గుల్మొహర్ పార్క్ కాలనీలో హోమం నిర్వహిస్తున్న దృశ్యం

ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికి కాలనీ అధ్యక్షులు మీర్ ఖాసిం కృతజ్ఞతలు తెలిపారు. జీఎంపీ నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు చెప్పారు. అనంతరం కాలనీ అధ్యక్షులు మీర్ ఖాసిం మట్లాడుతూ హోమం వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయని, వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుందని, ప్రతి ఇంట్లో హోమం నిర్వహించాలని కోరారు.

హోమం అనంతరం జీఎంపీ నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలుపుతున్న దృశ్యం

నిత్యం యోగా ఉచిత తరగతులకు హాజరవ్వాలని, రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని యోగా శిక్షకులు నూనె సురేందర్, గారెల వెంకటేశ్ కోరారు. ఈ కార్యక్రమంలో వెంకన్న, రాంచందర్ యాదవ్, సాయన్న, శ్రీహరి, సురేశ్, చంద్రకాంత్, ఏకనాథ్, నాగేశ్, నాగరాజు, మురళి, గాయత్రి, దేవకి, నాగమణి, పవన్ లు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here