- సంబంధిత జిహెచ్ఎంసి అధికారులతో కలిసి కాలనిలో పర్యటన
- తాగునీటి, డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లోని గోపినగర్, నెహ్రునగర్ కాలనీలలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఆ కాలనీలలో సంబంధిత జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ రోడ్ల సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కార్పొరేటర్ ను కోరారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాజీపడే ప్రసక్తే లేదని, అభివృద్ధి ప్రజల సంక్షేమమే బిఆర్ఎస్ ప్రథమ కర్తవ్యమని అన్నారు. కాలనీలో తాగునీటి సమస్యలను పరిష్కరించడంతోపాటు డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ పారిశుద్ధ్య సమస్యలను అధిగమించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ అభిషేక్ రెడ్డి, వర్క్ ఇన్ స్పెక్టర్ మోహన్, ఎలక్ట్రికల్ లైన్ మెన్ బ్రహ్మం, వాటర్ వర్క్స్ లైన్ మెన్ నవీన్, ఇంజనీరింగ్ వర్క్ ఇన్ స్పెక్టర్ జగన్ మోహన్, డివిజన్ ఉపాధ్యక్షుడు యాద గౌడ్, వార్డ్ మెంబర్ పర్వీన్ బేగం, గోపి నగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, దివాకర్ రెడ్డి, బసవరాజ్ లింగయత్, మల్కయ్య, రాజక్, ముంతాజ్ కాలా, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, నిరూప, ఎస్సీ ప్రెసిడెంట్ నరసింహ, తుకారం, రాజు, పిల్లి యాదగిరి, గౌసియా, అబ్దుల్ గని, నరేష్, గఫూర్, అబ్దుల్ కాలనీవాసులు పాల్గొన్నారు.