నమస్తే శేరిలింగంపల్లి: ప్రముఖ ఇంద్రజాలకుడు డాక్టర్ బి.ఎల్.ఎన్.రాజు విశిష్ట పురస్కారం అందుకున్నాడు. శేరిలింగంపల్లి భెల్ ఎంఐజీ ప్రాంతానికి చెందిన రాజు తన ఇంద్రజాల ప్రదర్శనలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో వేదిక క్రియేటివిటీ కల్చరల్ టాలెంట్ అండ్ వేరియస్ స్కిల్స్ సొసైటీ, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 24 క్రాఫ్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రకటించిన వేదిక తెలుగు నంది జాతీయ విశిష్ట పురస్కారము 2021కు ఎంపికయ్యారు.
విజయవాడలోని డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు కళాకేంద్రంలో ఇటీవల జరిగిన అవార్డుల ప్రధానోత్సవం లో డాక్టర్ బి.ఎల్.ఎన్ రాజు పాల్గొని పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేదిక తెలుగు నంది జాతీయ విశిష్ట పురస్కారం అందుకోవడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. తన ప్రతిభను గుర్తించి పురస్కారం అందజేసిన డాక్టర్ నరేంద్ర ఆరవల్లి బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.