విద్యార్థుల ప్రతిభను వెలికితీయడమే ’గీతాంజలి‘ లక్ష్యం

  • గీతాంజలి పాఠశాల చైర్మన్ పి. శ్రీనివాస్

నమస్తే శేరిలింగంపల్లి : విద్యార్థిని, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పరస్పర సహకారంతో బరంపేట లోని గీతాంజలి ఇంటర్నేషనల్ స్కూల్ ఉపాధ్యాయులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఈ నూతన ప్రక్రియలో భాగంగా అనేక రకాల మోడల్స్ ఉపయోగించుకుంటూ విద్యార్థుల ప్రతిభను తల్లిదండ్రులే పరీక్షించుకునేలా పాఠశాల ఉపాధ్యాయురాలు గాయత్రి అవకాశం కల్పించారు.

విద్యార్థులు తయారుచేసిన ఎగ్జిబిట్లను పరిశీలిస్తున్న వారి తల్లిదండ్రులు

ఈ కార్యక్రమంలో నర్సరీ నుంచి ఐదవ తరగతి వరకు విద్యార్థులు ఎంతో ఆసక్తిగా పాల్గొన్నారు. ఫలితంగా ఈ కార్యక్రమం ప్రత్యేక ప్రదర్శనశాలను తలపించింది. ఈ సందర్భంగా చైర్మెన్ పీ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు నిత్యం నేర్చుకుంటూ ఉంటే ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పారు.

అక్షరమాలను స్నేక్ అండ్ లాడర్ గేమ్ లో పొందుపరిచిన విధానాన్ని పరిశీలిస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు

సిఎఫ్ఓ దివ్య మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో మేధస్సు మరింత పటిష్టత, ఆసక్తిని కలిగి అభివృద్ధి చెందుతారని తెలిపారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గాయత్రి మాట్లాడుతూ తరచూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే విద్యార్థులు మరింత జ్ఞానాన్ని పొందుతారని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here