“నమస్తే శేరిలింగంపల్లి” కథనం…కదిలిన యంత్రాంగం.

  • నల్లగండ్ల-తెల్లాపూర్ రహదారికి తాత్కాలిక మరమ్మతులు

రహదారిపై గుంతలను పూడ్చుతున్న జిహెచ్ఎంసి సిబ్బంది.

శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): “నల్లగండ్ల రహదారిలో మూన్ వాక్- ల్యాండ్ మైనింగ్” శీర్షికన ఈ నెల 8 వ తేదీన నమస్తే శేరిలింగంపల్లి పబ్లిష్ చేసిన కథనానికి స్పందన లభించింది. ఈ ప్రాంతానికి చెందిన సాయితేజ, శ్రీకాంత్, శ్రీనివాస్, వినయ్ అనే నలుగురు యువకులు రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చమంటూ వినూత్న రీతిలో నిరసన తెలిపిన విషయం తెలిసిందే. సమస్యపై స్పందించిన జిహెచ్ఎంసి అధికారులు రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించారు. రోడ్డుపై ఏర్పడ్డ గుంతలను పూడ్చి తాత్కాలికంగా వాహనదారులకు ఉపశమనం కలిగించారు. దీంతోపాటు రహదారిపై విద్యుత్ దీపాలకు సైతం మరమ్మతులు చేపట్టారు.

స్ట్రీట్ లైట్లకు సైతం మరమ్మతులు చేస్తున్న సిబ్బంది

ఈ విషయమై శేరిలింగంపల్లి సర్కిల్ డీఈ శ్రీనివాస్ మాట్లాడుతూ నల్లగండ్ల-తెల్లాపూర్ రహదారి సంబంధిత అభివృద్ధి, మరమ్మతులు ఆర్ అండ్ బి పరిధిలోకి వస్తాయని అయినప్పటికీ ప్రజల సమస్యను దృష్టిలో ఉంచుకుని రహదారి పై ఏర్పడ్డ గుంతలను పూడ్చినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ అదికారుల స్పందనపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. గుంతలను పూడ్చి సమస్యను తాత్కాలికంగా పరిష్కరించినందుకు అధికారులకు, నమస్తే శేరిలింగంపల్లి నిర్వాహకులకు కృతఙ్ఞతలు తెలిపారు. సంబంధిత అధికారులు వీలైనంత త్వరగా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.

 

“నల్లగండ్ల రహదారిలో మూన్ వాక్- ల్యాండ్ మైనింగ్” కథనం కోసం క్రింద క్లిక్ చేయండి.

నల్లగండ్ల రహదారిలో మూన్ వాక్.. ల్యాండ్ మైనింగ్

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here