- ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన వివిధ పార్టీల నేతలు, లయన్స్ క్లబ్ ప్రముఖులు, గౌడ సంక్షేమ సంఘం నాయకులు
నమస్తే శేరిలింగంపల్లి: వివిధ పార్టీల నేతలు, లయన్స్ క్లబ్ ప్రముఖులు, గౌడ సంక్షేమ సంఘం నాయకులు నడుమ చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పి అశోక్ గౌడ్ జన్మదిన వేడుకలు ఆనందోత్సాహాలతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారంతా అశోక్ గౌడ్ ను శాలువాతో సత్కరించి పూల బొకే అందించి తమ చల్లటి ఆశీర్వచనా లతో దీవించారు.
అనంతరం కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిసారీ ఇలాంటి వేడుకలు ఎంతో సంతోషంగా జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థించారు.
ఆ తర్వాత లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ శేరిలింగంపల్లి ఆద్వర్యంలో లింగంపల్లి రైల్వేస్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.