- కారుకు బాయ్..బాయ్..చెయ్యి కి నై.. నై.. చెప్పండి
- గడపగడపకు బిజెపి రవన్న ప్రజా యాత్రలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : భారతీయ జనతా పార్టీ ఎన్నికల శంఖారావానికి సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ తెలిపారు. గడపగడపకు బిజెపి కార్యక్రమంలో భాగంగా గోపి నగర్, బాపూనగర్, ఆదర్శనగర్ లో పాదయాత్ర నిర్వహించారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ భారతీయ జనతా పార్టీకి రోజురోజుకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారని రవి కుమార్ యాదవ్ తెలిపారు. కొంతమంది నాయకులు ధన బలాన్ని, కుల బలాన్ని నమ్ముకుని రాజకీయం చేస్తున్నారని, పేదలకు నిస్వార్థంతో సేవ చేయాలనే సదుద్దేశంతో ముందుకు వస్తున్నామని, మీరంతా భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
కార్యక్రమంలో నవతారెడ్డి, ఎల్లేష్, అనిల్ కుమార్ యాదవ్, గుణశేఖర్, చంద్రమౌళి, శంకర్, ఝాన్సీ, రమేష్, నరసింహ, గణేష్, చంద్ర శేఖర్ యాదవ్, నరసయ్య పాల్గొన్నారు