నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని మధురనగర్లో జరుగుతున్న సీసీ రోడ్లు, డ్రైనేజి తదితర అభివృద్ది పనులను స్థానిక కార్పొరేటర్ గంగాధరరెడ్డి స్థానికులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు స్థానిక సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం గంగాధరరెడ్డి మాట్లాడుతూ డివిజన్ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. సిసి రోడ్లు, డ్రైనేజీ పనులు త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.






