ఘనంగా మిరియాల రాఘవరావు జన్మదిన వేడుకలు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సలహాదారులు, గ్రేటర్ వెస్ట్ సిటీ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ మిరియాల రాఘవరావు జన్మదిన వేడుక‌ల‌ను బుధ‌వారం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం గుడ్ సెపరేట్ డీప్ మరియు డంప్ స్కూల్, తపస్వి ఫౌండేషన్ హోమ్, షిరిడి సాయి ఓల్డ్ ఏజ్ హోమ్ లో అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ మిరియాల యామిని దివ్య మాట్లాడుతూ మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. పేద ప్ర‌జ‌ల‌కు ఎళ్ల‌వేళ‌లా స‌హాయ స‌హ‌కారాలు అందించేందుకు ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో సేవా కార్య‌క్ర‌మాలు విస్తృతం చేస్తున్నామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిరియాల సుగుణ, మిరియాల ప్రీతం తదితరులు పాల్గొన్నారు.

కుటుంబ స‌భ్యుల‌తో జ‌న్మ‌దిన వేడుక‌ల్లో మిరియాల రాఘ‌వ‌రావు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here