నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ రోడ్డు ప్రమాదంలో సాప్ట్ వేర్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన చండానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రామినేని మహేష్ బాబు (32) 8 నెలల క్రితం ఉద్యోగ నిమిత్తం గుంటూరు నుండి హైదరాబాద్‌కు వలస వచ్చి RC పురంలో నివసిస్తున్నారు.
23వ తేదీన ఇంట్లో గ్యాస్ అయిపోవడంతో మియాపూర్‌లో తనకు తెలిసిన వారి నుండి గ్యాస్ తీసుకువస్తానని చెప్పి తన స్కూటీ మీద Br No TS15FD6297 మియాపూర్ కు వెళ్ళాడు. అయితే అతను వెళ్లిన గంటన్నర తర్వాత తన స్నేహితుడు పరశురామ్ ఫోన్ చేసాడు. మహేష్ బాబు భార్యకు ఫోన్ చేసి మీ భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడని పరశురామ్ చెప్పాడు. మియాపూర్ వెళ్లే మార్గంలో క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ షాప్, చందానగర్ మెయిన్ రోడ్ లో ప్రమాదానికి గురయ్యాడని , డీసీఎం బి ఆర్ నంబర్ MH04LQ7666 అతివేగంతో స్కూటీకి కొట్టాడని, ఫలితంగా స్కూటీ మీద నుండి క్రింద పడగ వెహికల్ అతని వీపు పైనుండి వెళ్లగా తీవ్ర రక్తస్రావం జరిగిం దని తెలిపాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం అర్చన ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని డ్యూటీ డాక్టర్ ప్రకటించారు. ఈ విషయం పై పిర్యాదు చేయగా చందానగర్ ఎస్ ఐ శ్రీధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.