- రూల్స్ బ్రేక్ చేసేవారిపై సినిమా పంచ్ డైలాగులతో మీమ్స్
- ఆకట్టుకుంటూ ఆలోచింపజేస్తున్న పోస్టులు
ప్రస్తుతం సోషల్ మీడియాలో మీమ్స్ హవా నడుస్తోంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినీ తారలపై సందర్భానుసారంగా నెటిజన్లు తయారు చేస్తున్న మీమ్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సైతం ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు సినిమా డైలాగులతో కూడిన మీమ్స్ తయారు చేసి వారి ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు. ట్రాఫిక్ చలానాల నుండి తప్పించుకునేందుకు కొందరు వాహనదారులు తమ ద్విచక్రవాహన నెంబరు ప్లేటు కనిపించకుండా ఉండేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు వారి వివరాలను సాంకేతిక పరిజ్ఞానంతో కనుగొని చలానాలు విధిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై తయారు చేస్తున్న మీమ్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నయి. హస్యభరితంగా ఆకట్టుకోవడమే కాకుండా ప్రజలను ఆలోచింపచేసేలా ట్విట్టర్ వేదికగా సైబరాబాద్ పోలీసులు పెడుతున్న పోస్టులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
అతిగా ఉల్లంఘనలు చేసే వాహనదారులు, చలానాలు తప్పించుకునేందుకు నెంబర్ ప్లేట్ దాచే వాళ్ళు తప్పించుకున్నట్లు చరిత్రలో లేదు. pic.twitter.com/IDF1GJTBb1
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) February 6, 2021
వెనుక వైపు నెంబర్ ప్లేటు కనిపించకుండా మూసివేసి ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న ముగ్గురు యువతుల బైక్ నెంబరును ముందువైపు నుండి కనుగొన్న పోలీసులు అతిగా ఉల్లంఘనలు చేసే వాహనదారులు, చలానాలు తప్పించుకునేందుకు నెంబర్ ప్లేట్ దాచే వాళ్ళు తప్పించుకున్నట్లు చరిత్రలో లేదు. అంటూ సినిమా డైలాగుకు పేరడీ రాసి పోస్ట్ చేసిన మీమ్ ఆకట్టుకుంటోంది.
చలానాలు పడకుండా ఉండాలంటే ట్రాఫిక్ నియమాలు పాటించడం ఒకటే ఉత్తమ మార్గం, విన్యాసాలు చేసి తప్పించుకోవడం కాదు. #RoadSafety #RoadSafetyMonth #RoadSafetyCyberabad pic.twitter.com/IuZJcNQEEn
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) February 2, 2021
మరో ఘటనలో ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న ఓ ద్విచక్రవాహనదారుడిని పోలీసులు ఫోటో తీసే సమయంలో వెనుక కూర్చున్న మహిళ నెంబరు ప్లేటు కనిపించకుండా కాలు అడ్డు పెట్టేందుకు విఫల ప్రయత్నం చేసింది. అయితే పోలీసులు ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేని కారణంగా రూ. 1300తో పాటు నెంబరు దాచేందుకు ప్రయత్నించినందుకు రూ. 500, ప్రమాదకరంగా రైడింగ్ చేసినందుకు మరో 1000 రూపాయల జరిమానా విధించారు. ఈ సంఘటనకు అత్తారింటికి దారేదిలో సినిమా డైలాగుతో మీమ్ తయారు చేసి పోస్ట్ చేశారు.
https://twitter.com/CYBTRAFFIC/status/1358710191013830656/photo/1
ఇదేవిధంగా నెంబరు ప్లేట్లు వంచడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై సైబరాబాద్ పోలీసులు తయారు చేస్తున్న మీమ్స్ మీరూ ఒక్కసారి వీక్షించండి.
https://twitter.com/CYBTRAFFIC/status/1357161283821309952/photo/1