రోగరహిత జీవనం యోగాతోనే సాధ్యం: స్వామీ పరమార్ధ దేవ్

  • పెద్ద ఎత్తున పాల్గొన్న శేరిలింగంపల్లి పరిసర ప్రాంత యోగ ప్రియులు

నమస్తే శేరిలింగంపల్లి: తారానగర్ లోని విద్యానికేతన్ స్కూల్ లో పతంజలి యోగా సమితి, భారత్ స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత ఇంటిగ్రేటెడ్ యోగా శిబిరాన్ని నిర్వహించారు.

పతంజలి యోగా పీఠ్ జాతీయ అధ్యక్షుడు పూజ్య డాక్టర్ పరమార్ధ దేవ్ పర్యవేక్షణలో కొనసాగిన ఈ శిబిరంలో శేరిలింగంపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన యోగ ప్రియులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శిబిరార్ధులచే వ్యాయామ, ఆసన, ప్రాణాయామాలు చేయించిన స్వామీజీ పలు ఆరోగ్య నియమాలను సూచించారు. రోగరహిత జీవనం యోగాతోనే సాధ్యమని అన్నారు.

రోజువారి జీవితంలో ఆహార, జల, నిద్ర, నియమాలు విధిగా పాటించాలని అన్నారు. మనం తీసుకునే ఆహారంలో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు చేర్చాలని సూచించారు. భారతీయ జీవన విదానం, రిషి పరంపర విశ్వవ్యాప్త ప్రాచుర్యం పొందడం శుభసూచకమని అన్నారు. పూర్వీకుల ఆచార వ్యవహారాలు పూర్తిస్థాయిలో తిరిగి వాడుకలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఇంట్లో రోజు తప్పనిసరిగా యోగా, హోమం చేయాలని సూచించారు.

అనేక రోగాలకు ప్రాణాయామమే దివ్య ఔషదమని అన్నారు. కార్యక్రమంలో భారత్ స్వాబిమాన్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీదర్ జీ, సంఘటన మంత్రి నందనం కృపాకర్, ఉపాధ్యక్షులు శివకుమార్, పతంజలి యోగా సమితి రాష్ట్ర అధ్యక్షులు శివుడు, హైదరాబాద్ వెస్ట్ అధ్యక్షులు విఠల్, యోగా ప్రచారకులు అశోక్ ఆర్య, రామ ముని, హైదరాబాద్ వెస్ట్ జిల్లా బిఎస్ టి ఉపాధ్యక్షులు నూనె సురేందర్, యువ భారత్ అధ్యక్షుడు పుట్ట వినయకుమార్ గౌడ్, పతాంజలి యోగ సమితి ప్రతినిధులు ధీరజ్ సింగ్, తరిగొప్పుల స్వేత, జగన్నాథం, వెంకటేశ్, జ్యోతి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here