సీరియస్ వ్యాధులను సిగ్గుతో దాచేస్తున్నారు

  • మహిళలలో ప్రమాదకర స్థాయిలో క్యాన్సర్ వ్యాధి
  • తొలి దశలో గుర్తిస్తేనే నిర్మూలన సాధ్యం
  • క్యాన్సర్ తో ప్రతీ ఎనిమిది నిమిషాలకు ఒక మహిళ

మహిళలకు వచ్చే క్యాన్సర్ లకు సంబంధించి సమాజంలో ఇంకా సిగ్గు, బిడియంతో పాటూ వాటి గురించి మాట్లడడం నిషేధంగా ఉందనే చెప్పవచ్చు. “ఇక ఈ వ్యాధి ఎందుకొస్తుందనే అంశంపై అసలు నిజమైన అంశాలు కాక
ఎన్నో కథనాలు, విచిత్రమైన కథలు, అపోహాలు వ్యాప్తి లో ఉండి మహిళల మెదడులో మరింత గందరోగళానికి కారణమవుతున్నాయి. వీటి వల్లనే మన దేశంలో క్యాన్సర్ కు చికిత్స అందించే విషయంలో దానిపై మహిళలకు ఉన్న అపోహలే ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నాయి. ఇక పలువురు వైద్య నిపుణుల విశ్లేషణ ప్రకారం క్యాన్సర్ హాస్పిటల్ కు వెళ్లడమే సామాజికంగా నిషేధించబడే అంశం, ఇక వీటితో పాటూ మహిళలకు పచ్చే క్యాన్సర్ లు ఎక్కువగా పునరుత్పత్తి అవయవాలకు సంబంధించిన అంశాలు కావడంతో పాటూ ముఖ్యంగా స్త్రీ శరీర అందానికి సంబంధించిన అవవయంగా భావించబడే రొమ్ము క్యాన్సర్ విషయంలో తత్సంబదిత సమస్యలను చర్చించడానికి మహిళలు సిగ్గుతో వెనుకంజ
వేస్తున్నారు. వీటన్నింటితో పాటూ వీటికి సంబంధించిన అంశాలపై ఉన్న పలు అపోహలు, అభూతకల్పనలు చేరి మహిళలు ఒక వేళ క్యాన్సర్ భారిన పడినట్లయితే వాటిని వెల్లడించడానికి ఇష్టపడకుండా దాచి పెట్టడం జరుగుతోంది. ఇదంతా ఈ వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడం ప్రధాన కారణం. దాంతో వీరు వీటిపై ఉన్న పలు అపోహలను
నిజం అని నమ్ముతున్నారు. ఇలాంటి పలు అపోహలను తొలగించడమంటే వాటిపై అవగాహన కల్పించడమే. ఈ దిశగా చేస్తున్నదే ఈ చిన్న ప్రయత్నం..


మహిళలకు సంక్రమించే పలు రకాల క్యాన్సర్లు

మహిళలలో వచ్చే జనసేంద్రీయ సంబంధిత క్యాన్సర్లు ప్రధానంగా రోమ్ము భాగం, గర్భాశయం, గర్భాశయ ముఖ ద్వారం, ఫాలోపియన్ ట్యూబ్ లు, అండాశయం, యోని సంబంధిత భాగం మరియు యోని మధ్య గల భాగాలలో వస్తున్నాయి. వీటినే ప్రధానంగా పునరుత్పత్తి అవయవాలని కూడా పేర్కొనడం జరుగుతుంది

ఇవీ గణాంకాలు…

భారత దేశంలో ప్రతీ ఏటా 1.5 మిలియన్ కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఈ సంఖ్య ‘ఇతర అభివృద్ధి చెందిన దేశాల కన్నా తక్కువ ఉన్న ప్పటికీ అందుకు ప్రధానంగా తక్కువ వయస్సున్న వారు ఎక్కువగా ఉండడంతో పాటూ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా వయస్సు మళ్లే కొద్దీ ఏర్పడుతుంది. అయితే మన దేశంలో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. ఇటీవల ల్యాన్సెట్ అంకాలజీ లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం మహిళలు ఎక్కువ సంఖ్యలో పురుషుల కన్నా క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా భారత దేశంలో మహిళలకు వచ్చే మొత్తం క్యాన్సర్ కేసులలో రొమ్ము, గర్భాశయ ముఖద్వారం, అండాశయం, గర్భాశయాలకు సంబంధించిన క్యాన్సర్ లే 70 శాతంకు పైగా ఉంటాయి. ఈ అంకెలు మనలను బయపెడుతున్నాయనే చెప్పవచ్చు. దీంతో పాటూ నొయిడా కు చెందిన నేషనల్ ఇన్సిస్టిట్యూల్ ఆఫ్ క్యాన్సర్ ప్రైవెన్షన్ ఆండ్ రీసెర్చి వారి లెక్కిల ప్రకారం ప్రతి ఎనిమిది నిమిషములకు ఒక మహిళ క్యాన్సర్ తో చనిపోతుందని ఒక అంచనా. దీంతో పాటూ మనదేశపు మహిళలకు ఈ క్యాన్సర్ లు అభివృద్ధి చెందిన దేశాల మహిళల కన్నా ఆత్యంత త్వరగా వస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇటీవల ప్రముఖ పారిశ్రామిక సంస్థలకు సంబంధించిన సంస్థ ఫిక్కివారు 2017 లో ప్రచురించిన నివేదిక ప్రకారాం సుమారు ఏడు లక్షల మంది మహిళలు క్యాన్సర్ తో భాదపడుతున్నట్లు తేలింది. ఇక రొమ్ము మరియు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తో చనిపోతున్న వారి సంఖ్యలో భారత దేశం ఒకటో స్థానంలో ఉంటే గర్భాశయ క్యాన్సర్ తో చనిపోయే వారి సంఖ్య లో రెండవ స్థానంలో ఉండడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది.

వీరికే ప్రమాదమెక్కువ

ఏ సాధారణ మహిళ అయినా జననేంద్రియ క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గర్భాశయ లేదా ఎండోమెట్రియల్ క్యాన్సర్ ల బారిన పడే వారిలో ఎక్కువగా ఊబకాయంతో భాద పడేవారు. ఎక్కువ రక్తపోటు, మధుమేహం, లేటుగా మెనోపాజ్ రావడంతో పాటూ ఈస్ట్రోజన్, గర్భనిరోధక మాత్రలు మరియు టామోక్సీపెన్ వంటి ముందులు తీసుకోవడం ద్వారా వచ్చేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక అండాశయానికి సంబంధించిన క్యాన్సర్ రావడానికి గతంలో కుటుంబం లోని మహిళలకు ఎవరికైనా వచ్చి ఉన్నా, వయస్సు మళ్లినా, గర్భం ధరించకుండా కృత్రిమ గర్భదారణ చికిత్స తీసుకొన్న సందర్భాలలో, హార్మోన్ ను మార్చుకొనే చికిత్స, ఊబకాయంతో పాటూ రొమ్ము క్యాన్సర్ వచ్చిన వారికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. జననేంద్రియ మద్య భాగాలలో వచ్చే క్యాన్సర్ కు ప్రధానంగా హెచ్ పి వి వైరస్, దూమపానం, వయస్సు మళ్లడం, ఎయిడ్స్, వల్వర్ ఇంట్రపెథెలియల్ నియోప్లాసియా తో పాటూ లికెన్ సెరోసిస్ ఉన్న వారికి రావడానికి అవకాశం ఉంటుంది. యోని భాగంలో వచ్చే క్యాన్సర్ లకు ప్రధానంగా హెచ్ పి వి, ఎయిడ్స్, దూమపానం, ఆల్కహాల్ సేవించడం, వయస్సు మళ్లడం, డైటైల్బిల్బస్ట్రాల్, వజినల్ ఎడినోసిస్ తో పాటూ గతంలో గర్భాశయ క్యాన్సర్ వచ్చి ఉండడం, యోనిలో ఎక్కువగా చిరాకుగా ఉండడం వలన రావడానికి అవకాశం ఉంటుంది.

ఇలాంటి లక్షణాలు ఉంటే జాగ్రత్త…!

సాధారణంగా మహిళలలోనికి వచ్చే క్యాన్సర్ లకు సంబంధించిన లక్షణాలు ఇతరత్రా సమస్యలకు కూడా చెందినవి అవ్వడంతో వాటిని పలు మార్లు ప్రమాదకర స్థితిలోనికి వచ్చే వరకూ పట్టించుకోకపోవడం జరుగుతుంది.
ముఖ్యంగా గర్భాశయం లేదా ఎండోమెట్రియల్ క్యాన్సర్ల కు సంబంధించిన లక్షణాలను పరిశీలిస్తే మెనోపాజ్ వయస్సు మళ్లిన స్త్రీలలో యోని మార్గం లో రక్త స్రావం జరుగడం తో పాటూ మెనో పాజ్ కన్నా ముందు అసందర్భంగా ఎక్కువ యోని స్రావం జరుగడం, మధ్యంతర రుతుస్రావం వంటివి గమనించవచ్చు. ఇక అండాశయానికి సంబందించిన క్యాన్సర్ల కు సంబంధించిన లక్షణాలను పరిశీలిస్తే పొత్తి కడుపు నిండినట్లు అనిపించడం లేదా ఒత్తిడి అనిపించడం, ఉదరం ఉబ్బినట్లు ఉండడం తో పాటూ కొద్దిపాటి ఆహారం తీసుకొన్నా కడుపు నిండిపోయినట్లుండడం, ఆహారం జీర్ణం కాకపోవడం, మూత్ర విసర్జనకు సంబంధించిన మార్పులతో పాటూ ఆకలి లేక పోవడం, బరువు తగ్గిపోవడం జరుగుతుంది. ఇక గర్భాశయ ముఖ ద్వారానికి సంబంధించిన క్యాన్సర్ లకు సంబందించిన లక్షణాలలో పైన పేర్కొన్న వాటితో పాటూ మహిళల పీరియడ్స్ మధ్య కాలంలో ఎక్కువగా రుతుస్రావం జరుగుతుండడం, లైంగిక చర్య తర్వాత ఎక్కువగా ద్రవాలు స్రవించడంతో పాటూ ఈ వాసనతో సాధారణ రంగులో కాకుండా ఉండడం గమనించవచ్చు. యోనికి సంబంధించిన క్యాన్సర్లకు సంబంధించిన లక్షణాలను పరిశీలిస్తే యోనిలో దురద ఉండడం, ఎక్కువగా నొప్పి, మంట తో పాటూ ఇబ్బందికరంగా ఉండడంతో పాటూ యోని మధ్య భాగంలో వాచడం తో పాటూ యోని చర్మపు రంగులో మార్పులు రావడం గమనించవచ్చు.

గుర్తించడం ఎలా…?

మహిళలలో వచ్చే ఏ క్యాన్సర్ నైనా మొదటి దశలోనే గుర్తించగలిగితే పూర్తిగా నయం చేయవచ్చు. పలు సందర్భాలలో లక్షణాలు లేని వారిలో కూడా క్యాన్సర్ ఉండే ప్రమాదం ఉంటుంది. అందుకే ఒక వయస్సు వచ్చిన తర్వాత మహిళలలు వైద్యుల సలహాకు అనుగుణంగా పరీక్షలు చేసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా గర్భాశయం లేదా ఎండోమెట్రియల్ క్యాన్సర్ల విషయానికొస్తే మహిళలలో తీవ్రమైన రక్తస్రావం జరిగినా లేదా వయస్సు దాటిన తర్వాత ఏటా పరీక్షలు చేయించుకోవడం ద్వారా దీనిని త్వరగా గుర్తించవచ్చు. ఇక సాధారణంగా జరిపే
పొత్తి కడుపు పరీక్షలు, అల్ట్రా సౌండ్ లేదా రక్త పరీక్ష నిర్వహించినపుడు సీఎ 125 ను కొలవడం ద్వారా అండాశయానికి సంబంధించిన క్యాన్సర్ లను గుర్తించవచ్చు. ఇక మనదేశపు మహిళలలో ఎక్కువగా కనిపించే గర్భాశయ ముఖ ద్వారపు క్యాన్సర్ కు సంబంధించిన విషయానికొస్తే
21-29 సంవత్సరముల మధ్య వయస్సు ఉండి తరచుగా లైంగిక చర్యలలో పాల్గొంటున్న సందర్భాలలో 21 సంవత్సరముల నండి పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవడం చేయాలి. అటు పిమ్మట వైద్యుల సలహాకు అనుగుణంగా
మూడు సంవత్సరముల తర్వాత మరళా పరీక్ష చేయించుకోవచ్చు. ఇక 30 నుంచి 65 సంవత్సరముల వయస్సున్న మహిళలు వైద్యుల సూచనల మేరకు పాప్ స్మియర్ పరీక్షతో పాటూ హెచ్ పి వి పరీక్ష కూడా చేయించుకోవాలి. సాధారణంగా మూడు సంవత్సరముల కొక సారి ఈ పరీక్ష చేయించుకోవచ్చు. ఇక యోనికి వచ్చే క్యాన్సర్లకు సంబంధించి తరచుగా యోనిలో వచ్చే మార్పులను గమనించడంతో పాటూ ఎక్కడైనా చిన్న వాపు లేదా గడ్డ లాంటివి వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. ఇక చివరగా రొమ్ము క్యాన్సర్ కు సంబంధించి అద్దం ముందు నిలబడి రొమ్ములో వచ్చే మార్పులు లేదా ఏర్పడే గడ్డలను స్వీయపరీక్ష చేసుకోవడం ద్వారా గమనించి వెంటనే వైద్యున్ని సంప్రదించాల్సి ఉంటుంది, ఇలా మహిళలు ఈ అంశాలపై అవగాహన పెంచుకొని తమకు తామే సంబంధిత లక్షణాలను గుర్తు పట్టి వైద్యుని వద్దకు సందేహించకుండా వెళ్లి తగిన సూచనలు తీసుకొని అవసరమైన పరీక్షలు చేయించుకొంటే మొదటి దశలోనే వీటిని గుర్తుపట్టి పూర్తిగా నయం చేయవచ్చు. ఇక ముందుగా గుర్తించే చర్యలతో పాటూ ఆడపిల్లలు యుక్త వయస్సు వచ్చినప్పటి నుంచి వారి ఆరోగ్యంపై కొంత దృష్టి కేంద్రీకరించాలి. ముఖ్యంగా యుక్తవయస్సులో రుతుక్రమంలో వచ్చే నొప్పులను అమ్మాయిలు దాచి పెట్టి ఏదో తోచిన వైద్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలానే మహిళలలు తమ పొత్తి కడుపులో వచ్చే నొప్పి లేదా ఇతర మార్పులను కూడా అవి సాధారణ అజీర్తి సమస్యలుగా భావించి పట్టించుకోరు. కానీ అవి ఎక్కువ కాలం కొనసాగితే మాత్రం వాటిని అనుమానించాల్సిందే. ఇక ఇరవై సంవత్సరముల కన్నా చిన్న వారైన భారతీయ మహిళలో పలు హార్మోనల్ డిజార్డర్స్ ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఇలాంటి సమస్యలు ఏర్పడినపుడు వాటిని పట్టించుకోకుండా ఏదో కారణంతో సంబంధిత పరీక్షలు సరైన సమయంలో చేయించుకోకుండా ఆలస్యం చేయడంతో పాటూ సాంఘికంగా, ఆర్థికంగా మహిళలకు సాధికారత లేని సందర్భాలలో చికిత్స కూడా ఆలస్యం చేసుకోవడం జరుగుతుంది. అందుకే మహిళలు ఇలాంటి సమస్యలు గుర్తించిన వెంటనే అపోహలు వీడి కుటుంబ సభ్యులతో చర్చించి మంచి వైద్యున్ని సంప్రదించి పరీక్షలు చేసుకోవడం, చికిత్స తీసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా రొమ్ము, గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్లకు సంబంధించిన అంశాలను నలుగురిలో చర్చించడానికి మహిళలు సంకోచిస్తారు. ఈ సంకోచాన్ని వీడినపుడే దాని బారినుండి వీరిని కాపాడగలం. ఇందుకు ప్రధానంగా దీనికి సంబంధించిన పలు అంశాలపై మహిళలలో విస్తృతంగా అవగాహన కల్పించడమే పరిష్కారం తద్వారానే భారత దేశంలో మహిళలను మనం క్యాన్సర్ మహమ్మారి బారిన పడకుండా కాపాడగలం.


This article is prepared by Dr Priyamvada Reddy, Senior Consultant Gynecologist & Obstetrician, Apollo Cradle & Children Hospital, Hyderabad

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here