-హుడా కాలనీ దత్తసాయి ఎంక్లేవ్ లలో అభివృద్ధి పనుల పరిశీలన
హఫీజ్ పేట్ (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మాదాపూర్ కార్పొరేటర్ వి జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. ఇప్పటికే హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలో మంజూరైన పనులను వేగవంతంగా పూర్తి చేసేలా అధికారులతో కలిసి ముందుకు సాగుతున్నామని అన్నారు. మంగళవారం హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ, దత్తసాయి ఎంక్లేవ్ లలో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంజీర పైప్ లైన్ పనులను జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను కాలనీవాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రాధాన్యత క్రమంలో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని జగదీశ్వర్ గౌడ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంజయ్య, వెంకటేష్, ప్రసాద్, రాజు, శ్రీనివాస్, శరత్, కార్తిక్, అంజనేయుకు, రాములు తదితరులు పాల్గొన్నారు.