ప్రతి విద్యార్థి కష్టపడి చదవాలి : కార్పొరేటర్ హమీద్ పటేల్ 

నమస్తే శేరిలింగంపల్లి: చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డా. గడ్డం రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో, ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా, కొండాపూర్ డివిజన్ పరిధిలోనీ కొత్తగూడ విలేజ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పలువురు నాయకులతో కలసి పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు కార్పొరేటర్ హమీద్ పటేల్ ఎగ్జామ్స్ ప్యాడ్ లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కి అతి కీలకమైనది పదవ తరగతి అని అన్నారు. ఈ పదవ తరగతిలో విద్యార్థుల ప్రతిభను బట్టే వారి భవిష్యత్తు నిర్ణయించబడి ఉంటుందని అన్నారు.

కొత్తగూడ విలేజ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాట్లాడుతున్న కార్పొరేటర్ హమీద్ పటేల్

మంచి మార్కులతో పదవ తరగతి ఉత్తిర్ణులై చదువుకున్న పాఠశాలకు, చదువు చెప్పిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకోని రావాలని కోరారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం వ్యాప్తంగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు చేవెళ్ల ఎంపీ డా. రంజిత్ రెడ్డి పరీక్ష ప్యాడ్ లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారని, వారి కృషికి ఫలితంగా అందరూ కూడా మంచి మార్కులతో ఉత్తిర్ణులు కావాలని కోరారు. కొత్తగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు మొహ్మద్ మొయినుద్దీన్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు అబ్బుల కృష్ణ గౌడ్, తెరాస సీనియర్ నాయకులు అన్నం శశిధర్ రెడ్డి, షేక్ చాంద్ పాషా, రక్తపు జంగంగౌడ్, కేశం కుమార్ ముదిరాజ్, ఎర్రరాజు, నీలం లక్ష్మణ్ ముదిరాజ్, సాయి శామ్యూల్ కుమార్, జహీర్, రాహుల్ పాల్గొన్నారు.

పంపిణీ చేసిన ఎగ్జామ్స్ ప్యాడ్ లతో పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here