సింగరేణిలో జాబ్ కోసం చూస్తున్నారా ? అయితే సదవకాశం. సింగరేణిలో 651 ఖాళీలు ఉండగా తొలి విడతగా మొత్తం 372 ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ ఈ మేరకు తాజాగా వివరాలను ప్రకటించారు. 372 ట్రైనీ ఉద్యోగాల భర్తీకి సింగరేణి సంస్థ ఇటీవలే నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
372 పోస్టుల్లో స్థానిక రిజర్వేషన్ కింద ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ అభ్యర్థులతో 305 పోస్టులను భర్తీ చేస్తారు. మిగిలిన పోస్టులను అన్ రిజర్వ్‌డ్ కేటగిరి కింద భర్తీ చేస్తారు. ఆ పోస్టులకు తెలంగాణలోని ఇతర ఏ ప్రాంతం వారు అయినా సరే అప్లై చేసుకోవచ్చు.
జనవరి 22 (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటల నుంచి సదరు పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 372 ట్రైనీ ఉద్యోగాలు
ఫిట్టర్ – 128 పోస్టులు
జూనియర్ స్టాఫ్ నర్స్ – 84 పోస్టులు
ఎలక్ట్రిషియన్ – 51 పోస్టులు
వెల్డర్ – 54 పోస్టులు
టర్నర్ లేదా మెషినిస్టు – 22 పోస్టులు
ఫౌండ్రిమెన్ లేదా మౌల్డర్ – 19 పోస్టులు
మోటారు మెకానిక్ – 14 పోస్టులు
ఈ ఉద్యోగాలకు గాను అభ్యర్థులు సింగరేణి అధికారిక వెబ్‌సైట్ http://www.scclmines.com/ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొదట వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ ఫాం ను డౌన్‌లోడ్ చేయాలి. అనంతరం వివరాలను అన్నింటినీ నింపాక ఆ ఫాంను సింగరేణి ప్రధాన కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 4వ తేదీని దరఖాస్తుల సమర్ఫణకు ఆఖరి తేదీగా నిర్ణయించారు.