శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి పరిధిలోని భెల్ టౌన్ షిప్ లో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీ గా ఉన్న కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ లెక్చరర్ పోస్టులకు అర్హత కలిగిర అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ బాయి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థుల పిహెచ్ డి, పిజి మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, ఈ నెల 11 న సాయంత్రం 5 గంటల లోపు తమ దరఖాస్తులను కళాశాలలో అందించాలని సూచించారు. 15న నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. ఉన్నత విద్యావంతులు, నిపుణుల పర్యవేక్షణలో ఇంటర్వ్యూలు జరుగుతాయని, ఇతర వివరాలకు కళాశాల ప్రిన్సిపాల్ ను 9440375915, 9246931363 అనే ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.