నమస్తే శేరిలింగంపల్లి: రెండు చేతులు, ఒక కాలు లేని కుమారుడు, ఆనారోగ్యంతో మంచం పట్టిన భర్తను పోషించడానికి ఓ మాతృమూర్తి నానా కష్టాలు పడుతోంది. కుటుంబ దుస్థితిని తెలుసుకున్న మానవత్వం కలిగిన కొందరు ఆర్థికంగా సహాయం అందిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. న్యూ హఫీజ్‌పేట్ ప్రేమ్‌నగర్‌లో నివాసం ఉండే వెంకటేష్ గతంలో టైల్స్ పని చేసేవాడు. ఈ క్రమంలో 2004 డిసెంబర్ 24న బోరబండలోని ఒక సైట్‌లో విధులు నిర్వహిస్తుండగా కరెంట్ షాక్‌కు గురైయ్యాడు. దీంతో అతడి రెండు చేతులు, ఒక కాలు పూర్తిగా కోల్పోయాడు. వెంకటేష్ బాగోగులు చూడాల్సిన అతడి తండ్రి కొమరయ్య ఆరోగ్యం సైతం దెబ్బతిని ఓపెన్ హార్ట్, బ్రెయిన్ సర్జరీ అయ్యి మంచం భారిన పడ్డాడు. దీంతో వారిద్దరి పోషణ భాద్యత వెంకటేష్ తల్లి శశిరేఖపై పడింది. వీరి గురించి గతంలో నమస్తే శేరిలింగంపల్లి లో ప్రచురితమైన కథనం ద్వారా తెలుసుకున్న కొందరు దాతలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తెలంగాణ పోలీసుశాఖలో డిఎస్‌పి గా విధులు నిర్వహిస్తున్న సి.వంశీమోహన్‌రెడ్డి వెంకటేష్ కుటుంబానికి రూ.5వేలు, ఆయన స్నేహితుడు సాయితేజ రూ.5వేల విలువైన నిత్యవసర వస్తువులను అందజేశారు. వంశీమోహన్‌రెడ్డి మరో స్నేహితుడు సెక్రటేరియట్‌లో సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించే కావేటి రంజిత్ కుమార్ వెంకటేష్ కుటుంబానికి రూ.10వేలు ఆన్‌లైన్ లో అందజేశారు. వీరి కుటుంబానికి ఆర్థికంగా చేయూతనందించాలనుకునే వారు 8099734554 నెంబరులో సంప్రదించగలరు.