పేద కుటుంబానికి అశ్రీ సొసైటీ చేయూత

నమస్తే శేరిలింగంపల్లి: ఆ ఇంట్లో నలుగురు ఆడబిడ్డలే… కడు పేదరికంలో జీవనం సాగిస్తున్నారు.. ఇంతలోనే ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి కష్టాల ఊబిలో కూరుకుపోయింది ఆ కుటుంబం..కన్న తల్లి పాచిపనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. ఉంటున్న ఇంటి‌ అద్దె చెల్లించలేక.. నాలుగు మెతుకులు నోట్లో పెట్టుకునేంత అర్థిక స్థోమత లేక ఆ నలుగురు అమ్మాయిలు అల్లాడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అశ్రీ సొసైటీ ఆ కుటుంబానికి అండగా నిలిచింది. హఫీజ్‌ పేటకు చెందిన పేద కుటుంబానికి అశ్రీ సొసైటీ తరపున నిత్యావసర సరుకులను అందజేసింది. పేద కుటుంబానికి ఉపాధి కల్పించాలని భావించగా ఎమ్ ఎ బేగ్ వెంటనే స్పందించి కుట్టు మిషన్ అందజేయడం జరిగింది. కష్ట సమయంలో ఉన్న పేద కుటుంబానికి అండగా నిలిచి ఆదుకోవడం చాలా సంతోషంగా ఉందని అశ్రీ సొసైటీ నిర్వాహకులు పూర్ణీకిషోర్ రెడ్డి తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here