కన్నుల పండువగా శ్రీవారి మహా కళ్యాణోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ లోని శ్రీ విశాఖ శారదా పీఠపాలిత వెంకటేశ్వర ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండవ రోజు అంగరంగ వైభవంగా జరిగాయి. మంగళవారం ఉదయం స్వామివారికి నిత్యోపాశనం, ఉత్సావాస్తస్నపనం అనంతరం గోదాదేవి పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మహా కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆ తర్వాత అన్న సమారాధన చేశారు. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ వారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం అష్టోత్తర శత కలశ మండపారాధన భక్తులను ఆకట్టుకుంది. ఆలయ కార్యవర్గ సభ్యులు బచ్చు శ్రీకాంత్ దంపతులు స్వామివారి పుష్ప కళ్యాణమండపం సేవలో, ప్రధాన కార్యదర్శి టుడే సుభాష్ దంపతులు కళ్యాణ మహోత్సవ పుష్పాలంకరణ అన్నప్రసాద సేవలో, స్థానిక భక్తులు రామకృష్ణ శర్మ అదేవిధంగా మౌనిక కుటుంబ సభ్యులు హనుమత్ వాహనం సేవ లో భాగస్వాములయ్యారు.

శ్రీవారి మహా కళ్యాణోత్సవంలో అమ్మవారి పుస్తెను భక్తులకు దర్శనం చేయిస్తున్న ఆలయ ప్రధానార్చకులు శ్రీ సుదర్శనం సత్యసాయి

శ్రీవారి సేవలో స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి…
స్వామివారి బ్రహ్మోత్సవాలలో శ్రీ విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తర పీఠాధిపతులు శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి పాల్గొని ప్రత్యేక పూజలు ఆచరించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ తిరుమల తిరుపతికి ఏమాత్రం తీసిపోని విధంగా చందానగర్ లోని శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, ఈ ఘట్టాన్ని తిలకించిన భక్తులు ధన్యులు అని అన్నారు. అనంతరం శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఇరువురు స్వామీజీలను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయం పాలకమండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ను ఆశీర్వదిస్తున్న స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, పక్కన స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here