- మయూరీ నగర్ కాలనీలో సీసీ రోడ్ల పనులను పరిశీలించిన మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తన్న సీసీ రోడ్ల పనులను స్ధానిక నాయకులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సంధర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ మయూరినగర్ కాలనీలో సిసి రోడ్ల పనులను పరిశీలించానని, కాలనీలో మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ రోడ్లు, డ్రైనేజి, మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ సహకారంతో డివిజన్ పరిధిలో మంజూరైన అభివృధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి, వర్క్ ఇన్స్పెక్టర్ రఘు, కాలనీవాసులు, అశోక్, జహంగీర్, ప్రాన్స్స్ఇస్ రెడ్డి, మిరజ్ , రమేష్ , శోబాన్, బాధ్రి పాల్గొన్నారు.