- లక్ష దీప మహోత్సవంలో శ్రీలక్ష్మీ గణపతికి మహా పుష్పయాగం
- లింగాష్టకం విశిష్టతతో భక్తులను ఆకట్టుకున్న గరికపాటి ప్రవచనం
నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ శిల్పఎంక్లేవ్ లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో కార్తీక మాస లక్ష దీప మహోత్సవం ఆదివారం 9వ రోజు ఘనంగా కొనసాగింది. ఇందులో భాగంగా ఆలయ ప్రధానార్చకులు పవనకుమార శర్మ, మురళీధర శర్మ బృందం పర్యవేక్షణలో స్థానిక భక్తులు రామకృష్ణ కిరణ్, సుభద్ర మృదులల ఆద్వర్యంలో శ్రీలక్ష్మీ గణపతి స్వామి వార్లకు పుష్పయాగం వైభవంగా జరిపించారు. అన్ంతరం శేషగిరి రావు, శ్రీదేవి, శ్రీనివాస్, శివ నాగమణి దంపతుల ఆద్వర్యంలో స్వామివారికి అన్నసమారాధన చేశారు. పరిసర ప్రాంతాల భకితులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ప్రముఖ ప్రవచన కర్త, పద్మశ్రీ అవార్డు గ్రహిత, బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహా రావు దివ్య ప్రవచనం చేశారు. లింగాష్టకం అంశంపై వివరిస్తూ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాడు. ప్రకృతిని పరిరక్షించడమే నిజమైన భగవతారాధన అని అన్నారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ యూవీ రమణమూర్తి, కమిటి సభ్యులు చంద్రశేఖర్, చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి, సుధాకర్, విద్యాసాగర్ తదితరులు, శిల్పాఎన్‌క్లేవ్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ వాసులు, ఆలయ సేవాదళం సభ్యులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గరికపాటి ప్రసంగాన్ని విని తరించారు. అనంతరం ఉత్సాహంగా పదివేల దీపాలు వెలిగించారు.