మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): ఇంటివద్ద ఆడుకుంటున్న బదిర(మూగ, చెవుడు) బాలుడు కనిపించకుండా పోయిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి మండలం ఖిలా ఘనపురం ప్రాంతానికి చెందిన పద్మ, రెడ్యా దంపతులు తమ కుమారుడు బాబు(11) టెజో కలిసి మియాపూర్ సుభాష్ చంద్రబోస్ నగర్ లో నివాసముంటున్నారు. ఈ నెల 8 వ తేదీన బాబు ఇంటి నుండి కనిపించకుండా పోయాడు. తల్లి పద్మ తెలిసిన చోట వెదికినా ఫలితం లేకుండాపోయింది. దీంతో శుక్రవారం మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






